
బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో గ్రామసభలు జరుగుతున్న తీరును పథకాల వారీగా ప్రజల నుండి వస్తున్న అభ్యంతరాలను ఆయా మండలాల తహశీల్దార్ లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కు మంజూరు కొరకు వెరిఫికేషన్ చేశారు. మండలాల వారిగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బ్యాచ్ లిస్టు భీంగల్ 125, ఎర్గట్ల 25, మెండోరా 16, బాల్కొండ 73, వేల్పూర్ 28, ముప్కాల్ 24 బ్యాచ్ లిస్టులపై సంతకాలు చేశారు. ఈ సమీక్ష సమావేశంలో నియోజకవర్గ అధికారులు తదితరులు పాల్గొన్నారు.