తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఐదు నెలల్లో ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గానికి రూ.5 కోట్లు కేటాయించనుందని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఐదు నెలల్లో రూ.1,372 కోట్ల ఉపాధి హామీ పథకంతో ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టబోతుందని తెలిపారు. ఈ నిధుల ద్వారా వ్యవసాయ అభివృద్ధి పనులు మహిళా సంఘాలకు చేయూత గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం, ప్రతి నియోజకవర్గానికి రూ.5 కోట్లు, అదేవిధంగా మహిళల ఆదాయం పెంపు కోసం ప్రతి నియోజకవర్గానికి రూ.1 కోటి కేటాయింపు 2 ,700 ఎకరాల్లో ఉపాధి హామీ ద్వారా పండ్ల తోటలు, ఈతముక్కల పెంపకం, జలనిధి కింద రూ.204 కోట్లతో 11350 నీటినిల్వ సంరక్షణ పనులు, అలాగే రూ.106 కోట్లతో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి శ్రీకారం చేపట్టబోతుందని జుక్కల్ ఎమ్మెల్యే తెలిపారు.