పాల్వాయి నాగరాజుకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సామెల్

నవతెలంగాణ – నూతనకల్
మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్వాయి నాగరాజు పెళ్లిరోజు వేడుకలలో ఆదివారం తుంగతుర్తి శాసనసభ సభ్యులు మందుల సామేల్  పాల్గొని శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిని పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు ఎండి జహంగిర్ జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి జిల్లా నాయకులు కళ్లెం కృష్ణారెడ్డి, స్థానిక ఎంపీటీసీ టు పన్నాల రమా మల్లారెడ్డి పార్టీ యూత్ మండల అధ్యక్షుడు పసుల  అశోక్ యాదవ్ నాయకులు జట్టంగి గణేష్ బొడ్డు పెళ్లి అంజయ్య కూసు వెంకన్న సపాతి వాసుదేవరెడ్డి చురుకంటి చంద్రారెడ్డి పసివుల్లా, వాసిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.