ద్వజస్తంభ పునః ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌

నవతెలంగాణ-కోహెడ
మండలంలోని తంగళ్ళపల్లి గ్రామంలో భక్త మార్కండేయ ఆలయ ధ్వజస్తంభ పునః ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆదివారం హుస్నాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఆలయాలు అభివృద్ధి చెందాయన్నారు. నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం పద్మశాలీ కులస్థుల ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్‌, జెడ్పీటీసీ నాగరాజు శ్యామల మధుసూదన్‌రావు, బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, సర్పంచ్‌ పాము నాగేశ్వరి శ్రీకాంత్‌, ఎంపీటీసీ శేఖర్‌, పద్మశాలీ సంఘం కులస్థులు, మహిళలు, గ్రామస్థులు పాల్గోన్నారు.