
– మీసాలు మనం మేలేయ్యగలం…
నవతెలంగాణ – గీసుగొండ
పార్లమెంట్ ఎన్నికల్లో అధిక మెజార్టీ మన పరకాల నుండే వచ్చిందని అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో కూడా మెజార్టీని కొనసాగించాలని ఎమ్మెల్యే రేవూరి అన్నారు. అణగారిన వర్గాలకు ఉపయోగపడే విధంగానే సమగ్ర కుల గణన కార్యక్రమం ఉంటుంది అని అన్నారు.కొంతమంది నాయకులు జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ చూపకున్నా మీసాలు మెలేస్తున్నారని, అధిక మెజార్టీ ఇచ్చిన మనం ఎన్నిసార్లు మీసాలు తిప్పాలని అన్నారు. నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్త నాయకులని దారిలో పెట్టగలడు అని అన్నారు. పార్టీ జెండా మొసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుందని ఆయన నొక్కాడించి అన్నారు.అలసత్వం వహించిన మండల అధ్యక్షుల మేల్కొని స్థానిక ఎన్నికల పైన దృష్టి సారించాలని అన్నారు. పరకాలలో గ్రేడ్ సిస్టం కొనసాగుతుందని ఆయన తెలిపారు.కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు ముఖ్యమంత్రి ఆహ్వానించి భూములు కోల్పోయిన రైతులకు 100 గజాల స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి,పీసీసీ ప్రధాన కార్యదర్శి సౌజన్య,కొండేటి కొమురారెడ్డి,ప్రొపెసర్ గాదె దయాకర్,ధూపకి సంతోష్,వీరమ్మ,ఆకుల రుద్ర ప్రసాద్,కూసం రమేష్ ,మర్రి క్రాంతి ,శివ ,నాగరాజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.