పారిశుద్ధ్య, వైద్యం ప్రజలకు అందుబాటులో ఉంచాలి: ఎమ్మెల్యే

 నవతెలంగాణ- రామారెడ్డి
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్యం, వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ మంగళవారం అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీపీ దశరథ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా,సమావేశానికి సురేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని రంగ చెరువు అలుగు తెగి నీరు వృధా పోతుందని, రైతులకు ఇబ్బందిగా ఉందని చర్చ జరిగింది. విద్యుత్, నీటిపారుదల శాఖల సమస్యలపై పలువురు ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు శాఖల అధికారులు నివేదికను చదివి వినిపించారు. మండల సర్వసభ్య సమావేశానికి పలు శాఖల అధికారులు గై హాజరు పై ఎమ్మెల్యే సురేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పిటిసి నా రెడ్డి మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ రవీందర్రావు, రైతుబంధు అధ్యక్షులు గురిజాల నారాయణరెడ్డి, ఎంపీడీవో విజయ్ కుమార్, ఎమ్మార్వో రోజా, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.