ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి తన సొంత వ్యాపారాలపై ఉన్న శ్రద్ధ దుబ్బాక నియోజకవర్గ ప్రజలపై లేదని.. ఎమ్మెల్యేకు రైతుల కష్టాలు పట్టవా..? అని పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా.. నియోజకవర్గమైన కేంద్రమైన దుబ్బాకలో కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి నేటికీ ప్రారంభించకపోవడం బాధాకరమన్నారు. గురువారం పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పీఏసీఎస్ డైరెక్టర్లు బోయ యాదగిరి, గజబీంకర్ బాలరాజు, కాసం బాల్ రెడ్డి, డీసీసీ డైరెక్టర్ పూస దశరథం లతో కలిసి కొనుగోలు కేంద్రానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు అనంతుల శ్రీనివాస్, నర్మేట ఏసురెడ్డి, కొంగర రవి, ఆకుల భరత్, మంద శ్రీనివాస్, మచ్చ శ్రీనివాస్, బాస మధు, ఆస శరభయ్య, పడాల వినయ్, అన్వర్, ఐరేని సాయితేజ గౌడ్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.