గ్రామాల్లో త్రాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: ఎమ్మెల్యే

నవతెలంగాణ – అచ్చంపేట 
గ్రామాలలో త్రాగునీటి సమస్య లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధికారులకు సూచించారు. శుక్రవారం లింగాల మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. సర్పంచ్ ల పదవీకాలం పూర్తి అయ్యింది. ప్రతి గ్రామ పంచాయతీకి  ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలకు పరిష్కరించాలని సూచించారు.అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ,గ్రామాలలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఉపాధి పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎండలు తీవ్ర రూపం దాల్చుతుండడంతో ఉదయం ఎండ ప్రారంభం కాకముందే పనులు ప్రారంభించాలని, కూలీలకు పనులు జరుగుతున్న చోట త్రాగునీరు నీడ వసతి కల్పించాలన్నారు. జాబ్ కార్డు లేని వారికి జాబ్ కార్డ్ కల్పించి, ప్రతి ఒక్కరికి పని కల్పించాలని అధికారులకు సూచించారు. నర్సరీలో మొక్కల పెంపకం పనుల పట్ల శ్రద్ధ వహిస్తూ వాటి రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యం సిద్ధించే విధంగా నర్సరీలలో మొక్కల పెరుగుదలకు జరిగేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలోఎంపీపీ లింగమ్మ,వైస్,  ఎంపీపీ నారాయణ గౌడ్, ఎంపీడీవో ఆంజనేయులు పాల్గొన్నారు.