– అగ్రో ఇండస్ట్రీస్ చైర్మేన్ కాసుల బాల్ రాజ్.
నవతెలంగాణ – జుక్కల్
జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జుక్కల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షేట్కార్, తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ఎంపి అబ్యర్థి సురేష్ షెట్కార్ ను భారీ మేజార్టీతో గెలింపించాలని కార్యకర్తల సమావేశంలో తెలిపారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావ్ మాట్లాడుతూ.. హన్మంత్ షిండే పదిహేనేళ్లు జుక్కల్ ను బీబీ పాటిల్ పదేళ్ల నుండి జహీరాబాద్ ను దోచుకొని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో అవినీతి అసమర్థుడు అయిన హన్మంత్ షిండేను ఏ విధంగా బుద్ధి చెప్పి ఓడించారో అదేవిధంగా ఇప్పుడు బి. బి పాటిల్ ఓడించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. సురేష్ షేట్కార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని..సంగారెడ్డి నుండి జుక్కల్ నియోజకవర్గం వరకు నాలుగు లైన్ల రోడ్డు సురేష్ షెట్కార్ గారు తీసుకొచ్చారని కొనియాడారు..మళ్ళీ ఆయనను గెలిపిస్తే మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. అందుకే ప్రజలు ఆలోచించి విజ్ఞతతో సరైన నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సురేష్ షేట్కార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.