
నవతెలంగాణ – బోధన్ : ప్రభుత్వ హాస్టల్లో కళాశాలలను బోధన్ ఎమ్మెల్యే తక్షణమే సందర్శించి వాటి సమస్యలు పరిష్కరించడం పాటు పూర్తిగా అభివృద్ధి చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విగ్నేష్ డిమాండ్ చేశారు శుక్రవారం బోధన పట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ కళాశాలలకు, హాస్టళ్ల అభివృద్ధి కొరకు అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే బోధన్ డివిజన్లోని ప్రభుత్వ కళాశాలల్లో, పాఠశాలల్లో టీచర్లు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మధుమాలంచ కళాశాలకు ప్రత్యేకంగా నూతన భవన్లను నిర్మించాలని శిథిల వ్యవస్థలో ఉన్న పాఠశాలలను, హాస్టళ్లను మరమ్మతులు చేయాలని అన్నారు. ప్రభుత్వ కళాశాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, మధ్యాహ్న భోజన పథకానికి అధిక నిధులను కేటాయించి విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన మెస్ చార్జీలను అమలు చేయాలన్నారు. మధుమలాంచ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆకతాయిలు మద్యం సేవించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే చదువుకున్న పాఠశాలకే సరైన ప్రహరీ గోడ, కనీసం నైట్ వాచ్మెన్లు లేకపోవడం విడ్డూరం అని అన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి సాయి కుమార్, నాయకులు మహేష్, ప్రశాంత్, రాజు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.