సమాజానికి ఉపయోగపడేలా వార్తలు రాయాలి: ఎమ్మెల్యే

నవతెలంగాణ – పెద్దవూర
సమాజంలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమని, సమాజానికి ఉపయోగపడేలా వార్తలు రాయాలని నాగార్జున సాగర్ ఎంఎల్ ఏ కుందూరు జయవీర్ రెడ్డి అన్నారు. బుధవారం పెద్దవూర మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలి లింగారెడ్డి, గౌరవ అధ్యక్షులు మూల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ లో జయవీర్ రెడ్డి నివాసం లో జిల్లా నాయకులు యడవెల్లి దిలీప్ రెడ్డి, గడ్డం పల్లివినయ్ రెడ్డి లను శాలువాతో జర్నలిస్టులు ఘనసన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజ శ్రేయస్సుకు జర్నలిస్టులు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. నిజాలు నిర్భయంగా రాసినప్పుడే జర్నలిస్టుల కష్టానికి నిజమైన ఫలితం ఉంటుందన్నారు. గతంలో వార్తల కోసం కష్టపడ్డారని ప్రసుత్తం కొంత మార్పు వచ్చిందని తెలిపారు. వాట్సాప్‌ ద్వారా చక్కర్లు కొట్టే న్యూస్‌తో పత్రికా రంగానికి విలువ తగ్గిపోతుందని వాపోయారు. నిజాలను నిర్భయంగా రాసే సత్తా ఒక జర్నస్టులకే ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కూన్ రెడ్డి రాంరెడ్డి, పగిళ్ల విద్యాసాగర్, ఇరుమాది మోహన్ రెడ్డి,రమావత్ శోభన్ బాబు, సలికంటి వేంకటయ్య, మురళి పాల్గొన్నారు.