ఎమ్మేల్యే సీతక్క గెలుపు కాయం

మాజీ ఎంపిటిసి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు
నవతెలంగాణ- తాడ్వాయి
టిఆర్ఎస్ పార్టీ జెడ్ పి చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ప్రజలకు చేసింది శూన్యం అని, కాంగ్రెస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి దానసరి అనసూయ అలియాస్ సీతక్క గెలుపు ఖాయం అని మాజీ ఎంపిటిసి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సోలం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం ఊరటం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జడ్పీ ఛైర్పర్సన్ గా నాగజ్యోతి చేసిన అభివృద్ధి శూన్యం అని, ఓట్లప్పుడు మాత్రమే కనిపించడం, తర్వాత కనిపించకపోవడం ఆమెకు అలవాటే అని పేర్కొన్నారు. మండలం లో ఊరట్టం గ్రామపంచాయతీ పోలింగ్ బూత్ లో అత్యధిక ఆధిక్యం కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇవ్వాలి అని, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను మరింత మంది ని చేర్చుకోవాలి అని తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు. వచ్చే ప్రభుత్వం లో సీతక్క గారు ముఖ్యమైన పదవి లో ఉండి ఈ ప్రాంత అభివృద్ధి కి కృషి చేస్తారని, అవగాహనా లేని అమాయక బినామీ లకు ఓట్ల వేయకూడదని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్కకు అత్యధిక మెజార్టీతో ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సీతక్క యువసేన జిల్లా అధ్యక్షులు చేర్ప రవీందర్, మాజీ సర్పంచ్ కడారి రామస్వామి, గ్రామ కమిటీ అధ్యక్షులు కోటే నర్సయ్య, సీనియర్ నాయకులు కిరణ్, శ్రీనివాస్, రాజయ్య, మల్లక్క, సరిత, నేతాజీ, స్వామి, లింగరావు, శేఖర్, సురేందర్, కార్తీక్ మొదలగు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.