
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని అంతాపూర్ గ్రామంలో గ్రామ ప్రజల కోసం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రత్యేక చొరవ చూపుతూ.. నీతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఆ గ్రామ ప్రజల కోసం బోరు మోటర్ ను పంపించి ఆ గ్రామంలో బోరు వేయించారు. మండల నాయకులైన హనుమాన్లు స్వామి రామ్ పటేల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనుమంతు యాదవ్ ఆ గ్రామ మాజీ ఉపసర్పంచ్ విట్టల్ తదితరులు కలిసి బోరు మోటర్ ను పూజ చేశారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో బోరు వేయించగా పుష్కలంగా నీళ్లు పడ్డాయి గ్రామస్తులంతా బోరు మోటర్ నీటిని చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతాపూర్ గ్రామంలో సమస్య పరిష్కరించి బోరు వేయించడం ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే తక్షణమే కృషి చేయడం నాయకులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.