గంగసానిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
భువనగిరి మండలం గంగసానిపల్లి గ్రామంలో శివాలయంలో  విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయం గుడి నిర్మాణానికి రెండు లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం  అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ  మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రారంభించడం జరిగిందన్నారు.  ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్,  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎంపిటిసి పాశం శివానంద్ చెక్కుల వెంకటేష్, జిలుగు సతీష్ పవన్,  ఎడ్ల శీను నాగేష్ ఆనంద్ వెంకట్ సత్యనారాయణ లు  పాల్గొన్నారు.