భువనగిరి మండలంలోని ఆకుతోట బావి తండా, సూరేపల్లి , నందనం, అనాజిపురం, బొల్లేపల్లి గ్రామాలలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐకెపి, ఎపిఎం అంజయ్య, మాజీ ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్, మాజీ ఎంపీటీసీ గడ్డమీద చంద్రకళ వీరస్వామి, గోదా మల్లేష్ గౌడ్, మాజీ సర్పంచ్ ఏదునూరి ప్రేమలత మల్లేశం, మాజీ ఎంపీటీసీ గోనుగుంట్ల కల్పన శ్రీనివాస్ గౌడ్, నాయకులు కానుకుంట్ల బాబురావు, కానుకుంట్ల కొండల్, తాళ్లపల్లి బాలకృష్ణ గణేష్, బాలస్వామి , అశోక్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిక్కుల వెంకటేశం , రైతులు పాల్గొన్నారు.