
రెంజల్ మండలం అంబేద్కర్ నగర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు. 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే ఈ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రంథలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ అందంన్, రెంజల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొబిన్ ఖాన్, మాజీ జెడ్పిటిసి నాగభూషణం రెడ్డి, ధనుంజయ్, సిహెచ్ రాములు, జావిద్ , గంగా కృష్ణ, ఓ మోహన్, మైని మోహన్, వద్దవ్, వసంత్, బన్షియ నాయక్, షావుక అలీ, ఉబేద్, తదితరులు పాల్గొన్నారు.