
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలని బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ అన్నారు. మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రవేట్ పాఠశాలలతో పోటీ పడాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక వసతులపై ప్రధానోపాధ్యాయులతో చర్చించారు. అనంతరం కళ్యాణ లక్ష్మి 82 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రకారం ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసిందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.