నవతెలంగాణ- గాంధారి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు గాంధారిలో తెలంగాణ గిరిజనోత్సవ వేడుకలల్లో బాగంగా ఈ రోజు గాంధారి పట్టణ కేంద్రం లో శ్రీ జగదాంబ దేవి శ్రీ సేవాలాల్ మహారాజ్ మందిరం లో భోగ్ భండర్ కార్యక్రమం లోఎల్లారెడ్డి శాసన సభ్యులు జాజాల సురేందర్ పాల్గొన్నారు అనంతరం సేవాలాల్ మందిరం నుండి భారీ ర్యాలీగా నడుచుకుంటూ సభ వేదిక దగ్గర సంప్రదాయ గిరిజన నృత్యాలు, ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తెలంగాణ గిరిజన సంక్షేమ దినోత్సవం జరుపుకుంటున్నాం మని 2018 లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి శాసన సభకు పంపించిన మీకు ఎప్పుడు రుణపడి ఉంటా గిరిజనులకు త్వరలో పోడు భూముల పట్టాలు పంపిణీ చేస్తాం మీ ఇంటికి వచ్చి పోడు భూముల పట్టాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజనుల సంక్షేమం సీఎం కేసిఆర్ వల్లే సాధ్యమయ్యింది గిరిజనులకు 6% నుంచి 10% వరకు పెంచిన ఘనత కేసీఆర్ దే నాన్ని తాండలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే తాండలను గ్రామపంచాయతీ లు చేసి గిరిజనులకు గౌరవం పెంచిన నాయకులు కేసీఆర్ గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం కేసిఆర్ కృత నిశ్చయంతో వున్నారనిఆయనఅన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ రాధబలరాం, జడ్పీటీసీశంకర్ నాయక్, మాజీ జడ్పీటీసీ తనాజీరావు, పిఏసిఎస్ చెర్మెన్ సాయికుమార్, గాంధారి సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్, ఏ ఏం సి మాజీ చెర్మెన్ సత్యం, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు గిరిజనులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.