బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే చేయూత..

నవతెలంగాణ-భిక్కనూర్
బాధిత కుటుంబానికి కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అండగా నిలిచారు. మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన ఎల్లవ్వ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు విషయం తెలుసుకున్న గోవర్ధన్ తక్షణ సహాయం కింద 5000 రూపాయలు పంపించారు. వాటిని స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వామి, ఎంపీటీసీ సభ్యులు సాయి రెడ్డి, సొసైటీ అధ్యక్షులు వెంకటరెడ్డి, వెంకటేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ సిద్ధిరాములు, రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ దుర్గా రెడ్డి, నాయకులు ప్రభాకర్, కమలాకర్, దశరథం, అంజ గౌడ్, మాణిక్యం, తదితరులు ఉన్నారు.