
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలం చిన్న ఎక్లార, అవల్గావ్, గ్రామాలలో “డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఆదివారం నాడు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారానే వెనకబడిన వర్గాలు రిజర్వేషన్లు పొంది ఆర్థిక సామజిక అభివృద్ధి చెందుతున్నారని. రాజ్యాంగ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కానీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేసి రాజ్యాంగంలో మార్పులు చేయాలని కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు రూపంలో వారికి తగిన బుద్ధి చెప్పి బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజు ఆయా గ్రామాల అంబేడ్కర్ సంఘాల నాయకులు గ్రామ పెద్దలు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.