
రాష్ట్రంలో జరగబోయే మంత్రివర్గ విస్తరణ కార్యక్రమంలో ఎస్సీ రిజర్వుడు కాన్స్టెన్సీ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కు మంత్రి పదవి ఇవ్వాలని మద్నూర్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు జావిద్ పటేల్ సోమవారం నాడు విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడి ఉందని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే జుక్కల్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని, మైనారిటీలమంతా రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మైనారిటీల విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ జుక్కల్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి కట్ట పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.