
పట్టణంలో పలు కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం కొరకు రూ.40 లక్షల వ్యయంతో చేపట్టిన పనులకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ శంకుస్థాపన చేశారు. అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధి సభ్యులందరూ సహకరించాలని కోరారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజా ప్రభుత్వ హయాంలో పట్టణంలో అనేక అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందన్నారు. కొన్ని వార్డులలో ప్రాంతాల్లో పెండింగ్ లో ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, కౌన్సిలర్ గౌరీ శంకర్, ఆకుల వెంకటేష్, బాబా, శివ సుంకరి బాలరాజ్, రాఘవులు, కో ఆప్షన్ షమీం , సీనియర్ నాయకులు మేరే శ్రీనివాసుల, ప్రజాప్రతినిధులు. ఉన్నారు.