– వాకింగ్ చేస్తూ పట్టణ ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు
నవతెలంగాణ – అచ్చంపేట
గుడ్ మార్నింగ్ అచ్చంపేట కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పట్టణంలోని ప్రధాన రహదారిలో వాకింగ్ చేస్తూ ప్రజలను పలకరిస్తూ…సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు పక్కన చిరు వ్యాపారులను పలకరిస్తూ వ్యాపారం ఎలా ఉంది.! ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటున్నాయి అని అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రజలతో సరదాగా గడుపుతూ సాధారణ వ్యక్తి లాగా ప్రజలతో కలిసి టీ కొట్టు దగ్గర చాయ్ తాగారు. దినపత్రికలు చదివారు. ఉదయం బస్టాండ్ కు వెళ్లి ఉచిత రవాణా సౌకర్యం పథకం గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, రాజేందర్ న్యాయవాది, కౌన్సిలర్ గౌరీ శంకర్, అంతటి మల్లేష్, మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.