క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి: ఎమ్మెల్యే వంశీకృష్ణ

Sports bring mental excitement: MLA Vamsikrishnaనవతెలంగాణ – అచ్చంపేట 
క్రీడలు మానసిక ఉల్లాసంగా కలిగిస్తాయని, విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ విద్యార్థులకు సూచించారు. గురువారం పట్టణంలోని ఎమ్మేసన్ ఎక్సలెంట్ గ్రామర్ హైస్కూలో  సీఎం కప్ క్రీడలు నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయికి క్రీడాకారులు ఎదగాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాస్, ఎంఈఓ  జీవం కుమార్, ఎమ్మేసన్ పాఠశాల చైర్మన్ సీఎం రెడ్డి, ఎండి మనసుర్స్థానిక కౌన్సిలర్ సుంకరి బాలరాజు ఆ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.