ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే వంశీకృష్ణ

నవతెలంగాణ – అచ్చంపేట
కార్మిక శాఖ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను భవన నిర్మాణ తాపీ కార్మిక సంఘం కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ సూచించారు. ఆదివారం భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా స్పందించారు. సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి కార్మికుల ఇంట్లో ఆడకూతురువాహం జరిగితే 30 వేల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని, అదేవిధంగా పనులు జరుగుతున్న చోట ప్రమాదానికి గురైతే ఆస్పత్రిని ఖర్చులకు కూడా ప్రభుత్వ ఆర్థిక సాయం చేస్తుంది. ప్రతి కార్మికుడు కార్మిక శాఖ నుండి లేబర్ కార్డు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఉన్నారు.