నేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన

 నవతెలంగాణ  – కమ్మర్ పల్లి 
 బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీమంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 10గంటలకు బాల్కొండ మండలం నాగపూర్ గ్రామంలో రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారు.11గంటలకు వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలో రూ. 20లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3గంటలకు ఏర్గట్ల మండలం నాగేంద్ర నగర్ గ్రామంలో రూ.20లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, మధ్యాహ్నం 4గంటలకు తడపాకల్ గ్రామంలో రూ.20లక్షలతో నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ భవనాన్ని ప్రారంభిస్తారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయా మండలాల ప్రజాప్రతినిధులు కోరారు.