అమరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

నవతెలంగాణ- తిరుమలగిరి
తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామం తిరుమల హిల్స్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంట అమరేందర్ రెడ్డి తండ్రి రామచంద్ర రెడ్డి మృతి చెందారు.ఈ మేరకు శనివారం తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ హాజరై భౌతిక ఖాయనికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రగాఢ సానుభూతి తెలుపుతూ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్సోజ్ నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాలకుర్తి రాజయ్య, తుంగతుర్తి నియోజకవర్గం మైనార్టీ చైర్మన్ హఫీజ్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పేరాల వీరేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జమిలాల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మూల అశోక్ రెడ్డి, దానయ్య, కిషన్ రావు, మాజీ ఎంపిటిసి దుప్పెల్లి అబ్బాస్, కందుకూరి లక్ష్మయ్య,సోమ నరసయ్య, చింతకాయల సుధాకర్, గజ్జి లింగయ్య,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు అధైర్య పడద్దని చెప్పారు.