బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – నూతనకల్
ఇటీవల( శనివారం) మండల పరిధిలో అలుగునురు గ్రామనికి  చెందిన మల్లెబోయిన  కాటమయ్య ఒక్క గేదె,దిండిగాళ్ళ లింగరాజు  మూడు గేదెలు  కరెంట్ షాక్ తో మరణించగా విషయం  తెలుసుకున్న  తుంగతుర్తి శాసనసభ్యులు   మందుల సామేలు ఆదివారం  ఆ బాధ్యత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం  జిల్లా విద్యుత్ శాఖ అధికారితో చరవాణిలో మాట్లాడి శాఖ అందించే ఎక్స్గ్రేషియాను వెంటనే బాధిత రైతు కుటుంబాలకు అందజేయాలని ఆదేశించారు ఎక్స్గ్రేషియా అందే వరకు కుటుంబానికి అండగా ఉండి సహయం చేస్తా అని ఆర్థిక భరోసా కల్పించారు రాజకీయాలకతీతంగా రైతుల నష్టపోయిన అనుక్షణమే ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జెన్నరెడ్డి వివేక్ రెడ్డి ,మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు నాగం సుధాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు కట్ట మల్లారెడ్డి, కళ్లెం కృష్ణారెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు ఉప్పుల పాపయ్య, మెంచు చక్రయ్య భూరెడ్డి సంజీవరెడ్డి, దరిపెల్లి వీరన్న,ఇరుగు కిరణ్,అనంతుల  శ్రీను*  యువజన కాంగ్రెస్ మండల అద్యక్షులు పసుల అశోక్ యాదవ్ అలుగునూరు గ్రామ శాఖ అద్యక్షులు బంటు క్రాంతి  గ్రామ కాంగ్రెస్ నాయకులు  కుశల, గుండగాని సైదులు,బంటు గణేష్,కోల శివ, గోరంట్ల శ్రీను,కోల నరేష్ తదితరలు పాల్గొన్నారు.