మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే..

నవతెలంగాణ – పెద్దవూర
పెద్దవూర  మండలం, కోమటికుంట తాండాకు చెందిన పిఎసిఎస్ డైరెక్టర్ కిషన్ నాయక్  బంధువు రామావత్ నాన్కు ఇటీవల అనారోగ్యం కారణంగామృతి చెందారు. ఆదివారం నాగార్జున సాగర్ మాజీ ఎంఎల్ ఏ నోముల భగత్ కుమార్ వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించిన, వారి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జాటావత్ రవి నాయక్, యూత్ అధ్యక్షులు మెండే సైదులు, మాజీ మార్కెట్ డైరెక్టర్ పొదిల్ల శ్రీను,నక్క ముత్యాలు, రవి నాయక్, శ్రీకర్ నాయక్, శశిధర్ రెడ్డి,తుడుం రాకేష్, గోపి నాయక్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు మోహన్ నాయక్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.