ఫ్రూట్ మార్కెట్ ను సందర్శించిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – కంటేశ్వర్
మాజీ మంత్రివర్యులు బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ లోని ఫ్రూట్ మార్కెట్ ను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పండ్ల వ్యాపారస్తులతో మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన పండ్లను అందించాలని ,ఎవరైనా కాయలుగ ఉన్న వాటిని పండ్లు కావడానికి ఎటువంటి రసాయనాలు వాడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, అదే విధంగా మంచి పండ్లను మాత్రమే విక్రయించాలని, ప్రజలకు హాని చేసే విధంగా రసాయనాలను కలిపి నాసిరకం పండ్లను గాని విక్రయిస్తే,ఊరుకునేది లేదని, చట్టపరంగా చర్యలు తీసుకుంటన్నామని ఆయన అన్నారు. ఆయనతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షులు తాహెబ్దాన్ హంధాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగేష్ రెడ్డి , నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి  తదితరులు పాల్గొన్నారు.