
ఆలూరు మండలంలోని కల్లేడ గ్రామానికి చెందిన బాధిత కుటుంబాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కల్లేడ గ్రామానికి చెందిన బోడిగం నాగేష్ తమ్ముడు బోడిగం రామ్మోహన్ కుమారుడు గత నెల బ్రెయిన్ శాస్త్ర చికిత్స తరువాత మృతి చెందాడు. వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు కోత్తురు గంగాధర్, గ్రామానికి చెందిన బీజేవైఎం మండల అధ్యక్షులు గంగోల్ల ప్రళయ్ తేజ్, బూత్ అధ్యక్షులు మీరా అనిల్, సిరికొండ సాయికుమార్, బండారి మధు, గ్రామ ఇంచార్జ్ ఐలి వినోద్, సలహాదారులు ఇస్సాపల్లి బుమన్న, యూత్ అధ్యక్షులు మచ్చర్ల అర్జీత్, బుమన్న, కిసాన్, నరేష్ కార్యకర్తలు పాల్గొన్నారు.