నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని కొనసముందర్ గ్రామానికి చెందిన ఇబ్రహీం పట్నం భూమేశ్వర్ ఉపాధి నిమిత్తము గల్ఫ్ వెళ్లి అక్కడే అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం కోన సముందర్ లో మృతుడి భార్య, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ పరిస్థితిని స్థానిక బిఆర్ఎస్ నాయకుల ద్వారా తెలుసుకున్నాయన వారి బీద పరిస్థితి కి చలించిపోయి రూ.10వేల ఆర్థిక సహాయం అందించారు.అక్కడే ఉన్న అధికారులతో మాట్లాడి వారికి విడో పెన్షన్, ఇందిరమ్మ ఇండ్లు, గల్ఫ్ ఎక్స్ గ్రేషియా అందేలా దగ్గరుండి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట స్థానిక బిఆర్ఎస్ నాయకులు ఇంద్రాల రాజు, కాలేరు శేఖర్, తదితరులు ఉన్నారు.