నవతెలంగాణ-జైపూర్
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి శ్రీనివాస్ మృతి పార్టీకి రాష్ట్రానికి తీరని లోటని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం డీఎస్ అంత్యక్రియల్లో ఆయన పాల్గొన్నారు. డీఎస్‌తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసకున్నారు. డీఎస్‌తో కలిసి యూత్ కాంగ్రెస్‌లో పని చేశానని, డీఎస్ కుటుంబానికి తన కుటుంబానికి మధ్య సత్స సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో ఆయన పాత్ర కీలకమని, రాష్ట్ర ఏర్పాటుకు సోనియాగాంధీని డీఎస్ ఒప్పించారని గుర్తు చేశారు. పీసీసీ అధ్యక్షునిగా రెండు పర్యాయాలు పనిచేసిన డీఎస్ రాష్ట్రంలో కాంగ్రెస్‌కుి అధికారాన్ని కట్టబెట్టారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాలని ఆశించిన డీఎస్ తన కుమారుడు అరవింద్‌ను కేంద్ర మంత్రి పదవిలో చూడాలని అనుకున్నారని గుర్తు చేశారు.