రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం నియోజకవర్గంలో పలువురు ఆత్మీయుల వివాహాది శుభకార్యాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నిజామాబాద్ శ్రీరామ గార్డెన్ లో జరిగిన బంధువులు వేల్పూర్ లింబారెడ్డి కుమారుని వివాహ వేడుకకు హాజరయ్యారు.
పెర్కిట్ వెంకటేశ్వర గార్డెన్ లో జరిగిన భారత రాష్ట్ర సమితి యువజన విభాగం నాయకులు కిట్టు కోడలు వివాహ వేడుకలో పాల్గొన్నారు. కమ్మర్ పల్లి మండలంలోని హాసకొత్తూర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన ఉప్లూర్ నల్లా మోహన్ రెడ్డి కూతురు వివాహ వేడుకకు హాజరయ్యారు. వాడి గ్రామంలో జరిగిన సోషల్ మీడియా వారియర్ చింటూ బొమ్మేన వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట కమ్మర్ పల్లి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, నాయకులు మైలారం సుధాకర్, పిప్పెర అనిల్, ఏనుగు గంగారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మలావత్ ప్రకాష్, రైతు విభాగం మండల అధ్యక్షులు బద్దం రాజశేఖర్, ఆయా మండలాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.