పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని కల్లేడ, మామిడిపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సీసీ రోడ్లకు భూమి పూజ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు  సురేష్ నాయక్, జిల్లా కార్యదర్శి గంగోని సంతోష్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు రాజేందర్, బాలు, ప్రదీప్, కంది సాయిలు, రాములు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.