నవతెలంగాణ – అచ్చంపేట : అంబేద్కర్ ప్రజా భవన్ క్యాంప్ ఆఫీసులో శుక్రవారం ఎమ్మెల్యే వంశీకృష్ణ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. లక్షల ఖర్చు చేసి కార్పొరేట్ వైద్యశాలల్లో చికిత్స చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా ఉంటుందన్నారు. ప్రజాపాలనలో అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అలుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ నరసయ్య యాదవ్,, కాశన్న యాదవ్, కౌన్సిలర్ గౌరీ శంకర్, నాయకులు కార్యకర్తలు,, లబ్ధిదారులు ఉన్నారు.