సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

MLA distributed CMRF checks.నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పలు గ్రామాలకు చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధి, డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు చెక్కులను బుధవారం నాడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బుధవారం జుక్కల్ మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ.. జుక్కల్ మండలానికి చెందిన పలువురు పేదలు అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందడం జరిగింది. వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజురైన ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థిక సహాయాన్ని(CMRF చెక్కులు)  డబుల్ బెడ్రూం ఇళ్ల చెక్కులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ప్రజా ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ లో కొత్త రికార్డు సృష్టించిందని ఎమ్మెల్యే తెలిపారు. ఏడాదిలోనే రూ.8 వందల30 కోట్ల సాయం అందించామని,1 లక్ష.66 వేల  కుటుంబాలకు లబ్ది చేకూరిందని వివరించారు. 13 వేల మందికి రూ.2 వందల 40 కోట్ల విలువ చేసే ఎల్వోసీలు మంజూరు చేశామని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా ఆన్లైన్ లోనే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు. అనంతరం జుక్కల్ మండలం మిషన్ కల్లాలి గ్రామంలో నూతనంగా మంజూరైన ప్రభుత్వ చౌకధర దుకాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.