
మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామ సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జంగంపల్లి గ్రామ శివారులో బిటిఎస్ సమీపంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆదివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాలలోని తరగతి గదులు, వంటశాలలు, విద్యార్థుల సౌకర్యాలు పరిశీలించారు. గురుకుల పాఠశాలలో సమస్యలు, విద్యా బోధన, వసతులు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ లతో మాట్లాడుతూ పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం నుండి విద్యార్థులకు రావలసిన బిల్లులు, పుస్తకాలు, దుస్తువులు ఇతర సమస్యలు తెలియజేయాలని సూచించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనమందే విధంగా, ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు. ఈ పరిశీలనలో ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్ లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు.