రిమ్స్ ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

MLA who inspected Rimsనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
రిమ్స్ ఆస్పత్రి ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ ప్రాంతాల నుండి వస్తున్న రోగులకు అందుతున్న వైద్యం తీరును తెలుసుకుని స్వయంగా ఎమ్మెల్యే శనివారం రిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, పలువురు డాక్టర్లతో కలిసి ఆసుపత్రిలోని జనరల్ వార్డ్, చిల్డ్రన్స్ వార్డు, తదితర వార్డులను  తిరుగుతూ రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రికి ఎంతో నమ్మకంతో వచ్చే రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని రిమ్స్ డైరెక్టర్ తో పాటు వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు.