ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

MLA who inspected the government hospitalనవతెలంగాణ – ఆర్మూర్   

పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి  ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రి లో కలియ తిరుగుతూ బెడ్స్,లాబ్, కిచెన్ ఇతర వార్డ్ లు పరిశీలించారు,బాత్రూం శుభ్రంగా ఉంచాలని గర్భిణీ మహిళలకు ప్రత్యేకంగా కుర్చీలు ఇవ్వండి వారికి ఇబ్బంది లేకుండా చూడాలని డాక్టర్లను కోరారు. సాధ్యమైనంత వరకు ప్రభుత్వ దావకానలు మందులు ఉంటున్నాయని లేనియెడల జనరిక్ మందులు  మాత్రమే రాయాలని సూచించారు. వచ్చిన  రోగులు మాత్రం ఎక్కువ శాతం పేదవారు ఉంటారని వారికి సరైన వైద్యం అందించి భరోసా కల్పించాలని గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ వల్ల ఉపయోగాలు నార్మల్ డెలివరీ కోసం చేసే ఎక్సర్సైజులు తెలపాలని మహిళా వైద్యురాలకు తెలిపారు. ఎక్కువ శాతం నార్మల్ డెలివరీ చేయాలి ,చిన్న పిల్లలకు వైరల్ ఫీవర్ లాంటి రాకుండా డాక్టర్లు తగు జాగ్రత్త చెప్పాలని, x rey మిషన్లు లేకుండా  పేషెంట్ ఇబ్బంది చెందుతున్నారని వైద్యులు తెలిపారు. హాస్పిటల్లో ఏమేమి అవసరము నివేదిక ఇవ్వాలని వైద్యులను కోరారు ఒకసారి ప్రతి నెలకు ఒకసారి ఆస్పత్రిని పరీక్షించడానికి రావడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు.