బ్లాక్ మెయిల్ రాజకీయాలతో పబ్బం గడుపుతున్న ఎమ్మెల్యే

– తన ఎన్నికల స్టంట్ గానే ఓటు బ్యాంక్ రాజకీయాలు
– దుబ్బాక నియోజకవర్గ ప్రజలు తనను నమ్మి గెలిపిస్తే చేసింది శూన్యం
నవతెలంగాణ-దుబ్బాక రూరల్
బ్లాక్ మెయిల్ రాజకీయాలతో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావ్ పబ్బం గడుపుతున్నారని, నమ్మి ఓట్లేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలమయ్యారని దుబ్బాక మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాణాల శ్రీనివాస్ అన్నారు బుధవారం దుబ్బాక మండలంలోని అప్పనపల్లి గ్రామంలో బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో దమ్మ వెంకట్ రెడ్డి, వీరబోయిన రమేష్, రైతు కమిటీ అధ్యక్షుడు దమ్మ తిరుపతి తోపాటు పలురకాల కమిటీలను నూతనంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావ్ ఎన్నికల స్టంట్ గానే బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నారని పరామర్శ, విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.ఇక దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు ఉపఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. రానున్న రోజుల్లో దుబ్బాక ప్రజలు నమ్మే పరిస్థితి లేరన్నారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,ఎంపీటీసీలు, యువకులు పాల్గొన్నారు.