
భువనగిరి మండలంలోని పలు గ్రామాల్లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరి సహకారంతో భువనగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ నియోజవర్గంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. భువనగిరి మండలంలోని అనంతారం , తాజ్పూర్, బస్వాపురం, ముస్తాలపల్లి , చందుపట్ల గ్రామాలలో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధిలో అందరూ కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్ , జడ్పిటిసి సుబ్బురు బీరు మల్లయ్య, మండల పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎంపిటిసిలు పాశం శివ నందు, సామల వెంకటేశం, బొక్క కొండల్ రెడ్డి, ఫకీర్ కొండల్ రెడ్డి, ఓరుగంటి నాగయ్య, చిక్కుల వెంకటేశం, చిన్నం శ్రీనివాస్, వల్లందాస్ ఆదినారాయణ, పిట్టల వెంకటేషం, పాక వెంకటేష్ యాదవ్ లు పాల్గొన్నారు.