భువనగిరి మండలంలోని హన్మపురం, బస్వపురం, ముత్తిరెడ్డిగూడెం, అనాజీపూర్ గ్రామాలలో పలు అభివ్రుద్ది పనులను భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భువనగిరి మండలం హన్మపురం మదిర కుర్మగుడెం గ్రామంలో బీసి కమిటి హాల్, ప్రహారీ గోడ ప్రారంబోత్సవం, బస్వపురం గ్రామంలో ఫంక్షన్ హాల్, ప్రాధమిక పాఠశాలలో అదనపు తరగతి గది, డైనింగ్ హాల్, ముత్తిరెడ్డి గూడెం గ్రామంలో ప్రాధమిక పాఠశాలలో కిచెన్ హాల్, అనాజిపురం గ్రామంలో సిసి రోడ్ శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్, జడ్పిటిసి సూబ్బూరు బీరు మల్లయ్య, ఎంపీటీసీలు పాశం శివానంద్, రాంపల్లి కృష్ణ గౌడ్, జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు, సీపీఐ(ఎం) నాయకురాలు గునుగుంట్ల కల్పనా శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.