మండలం నూతనంగా ఏర్పడిన ఇందిరా నగర్ గ్రామపంచాయతీకి నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ …తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధిని మరిచిపోయారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పిచ్చి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రజాపాలన ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయవత్సవాల్లో భాగంగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని,.గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేస్తుందని, గ్రామాల్లో విద్య , వైద్యం పట్ల తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాలచైతన్య మహేందర్ రెడ్డి. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దానవత్ శంకర్ నాయkమండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డి మండల పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.