రంజాన్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

నవతెలంగాణ – ఆమనగల్

ఆమనగల్ పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ సదర్ అబ్దుల్ జబ్బార్ ఇంటివద్ద మంగళవారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ విందు వేడుకలో కల్వకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ముస్లిం సోదరులకు భోజనం వడ్డిచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులను జబ్బార్ కుమారులు, మైనార్టీ సెల్ నాయకులు అబ్దుల్ ఖాదర్, అబ్దుల్ రహీం, అబ్దుల్ కరీం తదితరులు పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీక్యా నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్, ఉపాధ్యక్షులు ఖలీల్, మండల అధ్యక్షులు తెల్గమల్ల జగన్, ఎంపీపీ అనిత విజయ్, జిల్లా నాయకులు కృష్ణ నాయక్, వస్పుల శ్రీశైలం, అలీం, కేఎన్ఆర్ సేవాదళం అధ్యక్షులు మెకానిక్ బాబా, జిల్లా అధ్యక్షులు విజయ్ రాథోడ్, స్థానిక మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.