
మండలంలోని దుర్గా నగర్ క్రింది తాండలో పంచయతన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బుదవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండాలో హిందుత్వం వంద శాతం ఉంటుంది అని పండుగలు ప్రకృతి తో ఉంటాయనీ, తండా వసూలు ప్రకృతితో ఉంటారన్నారు. ఆలయానికి ప్రహరీ గోడ కోసం అవసరం అయిన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆలయ సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు సురేష్ నాయక్, రాజ శేఖర్, హరీష్, రాజు తదితరులు పాల్గొన్నారు.