రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్ రివ్వు సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల 2024 రివ్యు సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తో పాటు జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ రివ్యూ సమావేశంలో పార్లమెంటు ఎన్నికపై సమీక్షించినట్లు సమాచారం.