నవతెలంగాణ- శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని కొత్తగట్టు, గ్రామంలో శ్రీ.మత్స్య గిరింద్ర స్వామి దేవస్థానంలో రాజగోపురం నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాచీన కాలం నుండి ప్రసిద్ధి చెందిన మచ్చ గిరింద్ర స్వామి ఆలయ నిర్మాణ అభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ చైర్మన్ సాగి మలహాలు రావు,సర్పంచ్ మోకిరాల కిషన్ రావు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మైపాల్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, సతీష్ రెడ్డి, ఆలయ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు.