వెంకటేశ్వర స్వామీ మఠంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

MLA who performed special pooja at Venkateswara Swamy Mathనవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం నీమానాయక్ తండాలో వెంకటేశ్వర స్వామి మఠంలో శనివారం నాగార్జున సాగర్ ఎంఎల్ ఏ కుందూరు జయవీర్ రెడ్డి హాలియా మార్కెట్ చైర్మెన్ తుమ్మల పల్లి చంద్రశేఖర్ రెడ్డి తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా ఎంఎల్ ఏ జయవీర్ రెడ్డి మాట్లాడుతూ..  ప్రజలందరు పాడి పంటలతో ఉండాలని కోరు కున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పబ్బు యాదగిరి, సాగర్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పగడాల నాగరాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు చల్ల హన్మంతురెడ్డి, రమావత్ సీతారాం నాయక్, రమావత్ నాగేశ్వర్ రావు, రమావత్ బాసు నాయక్ తదితరులు పాల్గొన్నారు.