నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని దేవక్కపల్లి గ్రామంలో నెలకొన్న త్రాగు నీరు ఎద్దడి సమస్యకు మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తోడ్పాటు అందించి పరిష్కారించారు.గ్రామస్తుల విజ్ఞప్తి మేరుకు ఎమ్మెల్యే కవ్వంపల్లి నూతన బోరుబావి పంపుసెట్ కొనుగోలు చేసి మరో బోరుబావి పంపుసెట్ కు మరమ్మతులు చేయించారు.శుక్రవారం గ్రామంలో త్రాగు నీరు సమస్య పరిష్కారించేల కృషి చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు,మండల కాంగ్రెస్ నాయకులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.